వేదాంత నికర లాభం 5 శాతం డౌన్
మార్చితో ముగిసిన త్రైమాసికంలో వేదాంత లిమిటెడ్ రూ. 7261 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం రూ.7629 కోట్ల నుంచి 5 శాతం తగ్గింది. అధిక వ్యయాలే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. వన్‌టైమ్ ట్యాక్స్ క్రెడిట్ పరిగణనలోకి తీసుకోకుంటే కంపెనీ నికర లాభం రూ. 7570 కోట్లు. ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్ రూ. 27,874 కోట్ల నుంచి రూ.39,342 కోట్లకు చేరింది. కంపెనీ వద్ద రూ. 27,154 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.