For Money

Business News

రూ. 440 నుంచి రూ. 1744కి!

దివంగత స్టార్‌ బ్రోకర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా దశాబ్దం క్రితం కొనుగోలు చేసిన ఓ షేర్‌ ఇపుడు మార్కెట్‌ డార్లింగ్‌గా మారింది. 2010లో స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించే నాటికే ఈ కంపెనీలో రాకేష్‌ ఇన్వెస్టర్‌. ఆయన అభిమానులు కూడా ఈ షేర్‌ను కొనుగోలు చేశారు. అయితే ఈ షేర్‌ అనేక సంవత్సరాలు ఏడ్పించింది. ఇపుడు కేవలం ఏడాదిలో రికార్డు లాభాలను ఆర్జించి పెట్టింది. గత ఏడాది సరిగ్గా అక్టోబర్‌ 26వ తేదీన వా టెక్‌ వాబాగ్‌ షేర్‌ ధర రూ. 440. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన ఈ షేర్‌ ఇవాళ రూ. 1744ని తాకింది. రెండేళ్లలో ఏకంగా ఈ షేర్‌ 549 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చింది. రాకేష్‌ ఆరంభంలో ఈ కంపెనీలో పెట్టిన పెట్టబడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా పేరుతో ఈ షేర్లు ఇంకా కొనసాగుతున్నాయి. గత జూన్ త్రైమాసికం చివరి నాటికి కంపెనీలో ఆమె పేరుతో 50 లక్షల షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలో దాదాపు 8 శాతం వాటాకు సమానం. వాటర్‌ ట్రీట్‌మెంట్‌కు ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీ సుమారు రూ.1000 కోట్లు విలువైన మెగా ఆర్డర్ రావడంతో ఈ షేర్‌ ర్యాలీ మరింత ఊపందుకుంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ ఈ కంపెనీ షేర్‌కు ఇచ్చిన టార్గెట్ ధర రూ.1700.