For Money

Business News

చైనాపై సుంకాల తగ్గింపు?

చైనాపై హడావుడి భారీ ఎత్తున సుంకాల విధించిన అమెరికా ఇపుడు పునరాలోచనలో పడింది. కీలకమైన ఖనిజాల ఎగుమతిని చైనా ఆపేయడంతో అమెరికాలోనే ట్రంప్‌ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో చైనాపై విధించిన సుంకాలను భారీగా తగ్గించే ఆలోచన ట్రంప్‌ సర్కార్‌ చేస్తోందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది. ఇపుడు చైనా దిగుమతులపై 145 శాతం దాకా సుంకాలను విధించింది అమెరికా. దీన్ని 50 -65 శాతనికి తగ్గించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను పేర్కొంటూ ఈ వార్తా పత్రిక కథనం రాసింది. చైనాతో తమ సంబంధాలు బాగున్నాయని ట్రంప్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు.అయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంపై వైట్‌ హౌస్‌ ఇంకా స్పందించలేదు.