For Money

Business News

అక్రమ వలసదారులకు తాజా హెచ్చరిక

అక్రమంగా తమ దేశంలో ఉంటున్న వలసదారుల పట్ల అమెరికా తాజా మరో హెచ్చరిక జారీ చేసింది. దేశంలో అక్రమంగా ఉన్న వలసదారులు వెంటనే తమ పేర్లతో పాటు అడ్రస్‌ను, వేలి ముద్రలను ప్రభుత్వం వద్ద నమోదు చేయాలని హెచ్చరించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఓ హెచ్చరిక జారీ చేసింది. అక్రమ వలసదారులు తమకు తాము ఈ వివరాలు అందించాలని లేని పక్షంలో జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ ఉంటాయని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌ ప్రకారం ఈ వివరాలు అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ రిజస్ట్రేషన్‌కు సంబంధించి ఒక ఫామ్‌ను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (USCIS) విడుదల చేయనుంది. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులతో ఎంత మంది అక్రమ వలసదారులు తమకు తాముగా తమ పేర్లను నమోదు చేసుకుంటారో చూడాల్సి ఉంది.