నష్టాల్లోకి జారుకున్న వాల్‌స్ట్రీట్

ఆరంభం లాభాలన్నీ కొన్ని గంటల్లోనే ఆవిరి అయిపోయాయి. అమెరికా విధించిన సుంకాలపై మళ్ళీ చర్చలు జరిగే అవకాశముందంటూ వార్తలు రావడంతో ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. ఒకదశలో అర శాతంపైగా లాభపడ్డాయి. అయితే మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. డాలర్ కూడా ఒక శాతంపైగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 104 ప్రాంతంలో ట్రేడవుతోంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా మూడు శాతం క్షీణించింది. నాస్‌డాక్ అర శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ 500 కూడా 0.43 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక డౌజోన్స్ 0.16 శాతం నష్టంతో ఉంది. డాలర్ వీక్‌నెస్ ప్రభావం బులియన్ మార్కెట్‌పై ఉంది. బంగారం మళ్ళీ 3000 డాలర్లవైపు పయనిస్తోంది. అమెరికా ఇపుడు ఔన్స్‌బంగారం 2940 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి కూడా రెండున్నర శాతంతో ఉంది.