వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ ఉత్సాహం
నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్ లాభాల్లో ముగిసింది. నాస్‌డాక్ దాదాపు అర శాతం లాభపడింది. అయితే అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ట్రేడవుతుండటం విశేషం. చైనాకు మళ్ళీ ఎన్‌విడియా చిప్‌లు సరఫరా చేస్తామని ఆ కంపెనీ సీఈఓ జెన్‌సెన్ హువాంగ్ పేర్కొనడం టెక్ కంపెనీలకు మంచి ఊతం ఇచ్చింది. 2027లో మరో లక్ష కోట్ల డాలర్ల ఆదాయం ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. H200 AI చిప్స్‌ను ఎన్‌విడియా చైనాకు సరఫరా చేయనుంది. మరోవైపు
ఇప్పట్లో బ్రెంట్ క్రూడ్ తగ్గదని బ్రోకింగ్ సంస్థ UBS పేర్కొంది. జూన్‌కల్లా 90 డాలర్లు, డిసెంబర్ నాటికి85 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. 2027 మార్చికల్లా 80 డాలర్లకు చేరొచ్చని UBS అంటోంది. ఇవాళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీ కానుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం భారీగా పెరిగినందున వెంటనే వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించదని అంటున్నారు.
