గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
కొత్తగా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 100 శాతం దాకా మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్ వచ్చేనెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది. గృహాలు రుణాలపై బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు 50 శాతం మాఫీ చేస్తున్నామని.. ఈ రుణాలపై టాప్ అప్ అనుబంధ రుణాలపై బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఇతర అడ్వకేట్, వాల్యూయర్ ఫీజు-వాస్తవిక ఖర్చులు యధావిధిగా రుణ గ్రహీత భరించాల్సి ఉంటుంది. ఇంటి రుణంలో 0.35 శాతం బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, కనీసం రూ.2000 నుంచి గరిష్టంగా రూ.10వేలు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అలాగే ఇతర ఫీజులు మాత్ర ఉంటాయి.