For Money

Business News

యూనియన్‌ బ్యాంక్‌ భేష్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీ ఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 49 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే బ్యాంక్‌ లాభం రూ.727 కోట్ల నుంచి రూ.1025 కోట్లకు పెరిగింది. అయితే ఆదాయం మాత్రం రూ.20,2012.84 కోట్ల నుంచి రూ.19,453.74 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్‌పీఏలు 13.49 శాతం నుంచి 11.62 శాతానికి తగ్గినా… నికర ఎన్‌పీఏలు మాత్రం 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.5210.50 కోట్ల నుంచి రూ.2549.58 కోట్లకు తగ్గాయి. దీంతో బ్యాంక్‌ అధిక నికర లాభం ప్రకటించడానికి వీలైంది.