For Money

Business News

దుమ్మురేపుతున్న టైర్‌ కంపెనీల షేర్లు

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడంతో టైర్‌ కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. ఒకదశలో 126 డాలర్లు ఉన్న బ్యారల్‌ క్రూడ్‌ ధర ఇపుడు 80 డాలర్ల దారిదాపుల్లోకి వచ్చేసింది. దీంతో టైర్‌ కంపెనీల లాభదాయకత అమాంతంగా పెరగనుంది. పెయింట్‌, టైర్‌ కంపెనీలకు ప్రధాన ముడి పదార్థం ముడి చమురు. జేకే టైర్స్‌ కంపెనీ షేర్‌ ఇవాళ రూ. 196 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది 52 వారాల గరిష్ఠ ధర రూ. 197కు దగ్గరగా వచ్చేసింది. ఇవాళ 12 శాతం లాభంతో రూ. 193.80 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ షేర్‌ 39 శాతం పెరిగింది. అలాగే అపోలో టైర్స్‌ షేర్‌ కూడా 92 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇవాళ రూ. 295 వద్ద ప్రారంభమైన ఈ షేర్‌ వెంటనే రూ. 293ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 312.35ను దాటింది. ఇవాళ ఒక్కరోజే ఈ షేర్‌ 6.35 శాతం పెరిగింది. ఈ ఏడాది ఈ షేర్‌ 41.37 శాతం పెరగడం విశేషం.