మండే బెట్స్ … ఈ రెండు షేర్లు
రేపటి డే ట్రేడింగ్ కోసం రెండు షేర్లను ఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన ఆదిత్య అగర్వాలా సూచిస్తున్నారు. ఎకనామిక్ పాఠకుల కోసం ఆయన ఈ రెండు షేర్లను సిఫారసు చేశారు. సోమవారం ట్రేడింగ్ కోసం పాలిక్యాబ్ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 2,471 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ను రూ. 2,640 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని, అయితే స్టాప్‌లాస్‌ను రూ. 2,375గా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఆయన సిఫారసు చేసిన మరో షేర్ రూ. కోల్టే పాటిల్ డెవలపర్స్. ఈ షేర్ ప్రస్తుత ధర రూ. 322 కాగా రూ. 355 టార్గెట్ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. స్టాప్‌లాస్ రూ. 306.
ఇక నిఫ్టి మూవ్మెంట్ గురించి మాట్లాడుతూ…నిఫ్టి ఇపుడు ప్రస్తుత స్థాయిలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయొచ్చని ఆదిత్య అగర్వాలా తెలిపారు. 17,400 నుంచి 17,560 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముందన్నారు.ఒకవేళ నిఫ్టి గనుక 17560 స్థాయిని దాటి పటిష్ఠంగా ట్రేడవుతే… 17600 లేదా 17,780 ప్రాంతానికి చేరే అవకాశముందని తెలిపారు. పడితే 17400 దిగువకు చేరితే 17,200 ప్రాంతంలో మద్దతు లభిస్తుందన్నారు. నిఫ్టి 89 రోజుల చలన సగటు 17,400 స్థాయిని బుల్స్ కాపాడే అవకాశముందని అన్నారు.