ట్విటర్ బ్లూటిక్ ధర నెలకు 8 డాలర్లు
మార్కెట్ ఊహించినట్లే బ్లూటిక్ ధరను ట్విటర్ వెల్లడించింది. కంపెనీ కొత్త ఓనర్ ఎలాన్ మాస్క్ ఈ విషయాన్ని ట్విట్ చేస్తూ బ్లూటిక్ కావాలని ఆశించేవారు ఇక నుంచి ప్రతి నెలా 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం అమెరికా మార్కెట్‌కు మాత్రమే. ఇతర దేశాలకు అక్కడి కొనుగోలు శక్తి ప్రకారం రేటు నిర్ణయిస్తామని ఆయన ట్వీట్ చేశారు. బ్లూటిక్ తీసుకోవడం వల్ల… సదరు అకౌంట్ నిజమైనదని.. ఫేక్ కాదని అర్థం. పైగా బ్లూటిక్ తీసుకునేవారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ట్విట్‌కు సమాధానం ఇచ్చినపుడు బ్లూటిక్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే సెర్చ్‌లో కూడా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. పైగా వీరు ఎక్కువ నిడివి ఉన్న ఆడియో, వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా పలు ప్రయోజనాలు ఉంటాయి.