ట్విటర్ టిక్‌లు ఇక మూడు రంగుల్లో..
వెరిఫైడ్ ఖాతాలకు మూడు వేర్వేరు రంగుల్లో టిక్ మార్క్‌లను కేటాయించనున్నట్లు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా వేర్వేరు రంగులతో ఈ బ్యాడ్జ్‌లను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబరు 2 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ‘వెరిఫైడ్’ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీలకు గోల్డ్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, వ్యక్తులకు బ్లూ టిక్ ఇవ్వనున్నట్లు ఎలాన్ మాస్క్ తెలిపారు. మిగిలిన వివరాలను వచ్చేవారం వెల్లడిస్తామన్నారు. ఇదే సమయంలో హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.