For Money

Business News

‘X’ గా ట్విటర్‌..

ట్విటర్‌ లోగో మారిపోయింది. ఇపుడున్న పిట్ట స్థానంలో ‘ఎక్స్‌’ (X)గా మార్చారు. ట్విటర్‌ వెబ్‌సైట్‌ను ఎక్స్‌ డాట్‌ కామ్‌ (X.com)తో లింక్‌ చేశారు. 1999లో ఎలాన్‌ మస్క్‌ X.com పేరుతో స్టార్టప్‌ను స్థాపించారు. దీన్ఇ పేపాల్‌ చేతుల్లోకి వెళ్లినా… ఎక్స్‌ డాట్‌ కామ్‌ డొమైన్‌ను ఎలాన్‌ మస్క్‌ మళ్లీ కొనుగోలు చేశారు. ఇపుడు ఆ పేరును ట్విటర్‌కు ఇచ్చారు. ట్విటర్‌ కొనుగోలు తరవాత ఉద్యోగుల తొలగించడంతో ఎలాన్‌ మాస్క్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తరవాత బ్లూటిక్‌పై కూడా పెద్ద వివాదమే జరిగింది. మరి లోగో మార్పును నెటిజన్లు ఎలా ఆహ్వానిస్తారో చూడాలి.