For Money

Business News

వెంటనే షేర్ల సెంటిల్మెంట్‌?

షేర్‌ మార్కెట్‌ లావాదేవీలను వెంటనే సెటిల్మెంట్‌ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సెబీ ఛైర్‌పర్సన్‌ మధాబి పూరి బుచ్‌ తెలిపారు. ఇవాళ ఆమె ముంబైలో మాట్లాడుతూ… సెటిల్మెంట్‌ ఎప్పటికపుడు పూర్తయితే ఇన్వెస్టర్లకు చాలా ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఈ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.కొత్త ఈక్విటీలతో పాటు రుణ సాధనాల జారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సెబి చర్చిస్తోందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా మ్యూచువల్ ఫండ్‌ స్కీములకు ఆమోదం తెలుపేందుకు ప్రయత్నిస్తున్నట్లు బుచ్‌ తెలిపారు. అలాగే షేర్ల డీలిస్టింగ్‌ ప్రక్రియలో మార్పులు తేవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇపుడు షేర్ల డీలిస్టింగ్‌ సమయంలో రివర్స్‌ బుక్‌ బిల్డింగ్‌ పద్ధతిని పాటిస్తున్నామని… అలా కాకుండా ఫిక్సెడ్‌ రేటు చెల్లించి షేర్లు డీలిస్టింగ్‌ చేసే పద్ధతి గురించి యోచిస్తున్నట్లు తెలిపారు.