For Money

Business News

టీవీఎస్‌ చేతికి స్విట్జర్లాండ్ కంపెనీ

స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద ఇ – బైక్ కంపెనీ అయిన స్విస్ ఇ-మొబిలిటీ గ్రూప్ ఏజీ ( ఎస్ఈఎమ్‌జీ) లో 75 శాతం వాటాను టీవీఎస్ మోటార్ కంపెనీ కొనుగోలు చేసింది. 10కోట్ల డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) క్యాష్‌ను కంపెనీ చెల్లించనుంది. ఐరోపాలో కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఈ టేకోరవ్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది . ఇటీవల నార్టన్ మోటార్‌ సైకిల్స్, ఈజీఓ మూమెంట్లను టీవీఎస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్లో ఎస్ఈలో మిగిలిన 25 శాతం వాటాను కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు టీవీస్ మోటార్ కంపెనీ సంయుక్త ఎండీ సుదర్శన్ వేణు పేర్కొన్నారు . ఎస్ఈఎమ్‌జీకి స్విట్జర్లాండ్లో 38 భారీ రిటైల్ స్టోర్లున్నాయి.