For Money

Business News

F&O: రెకమెండేషన్స్‌ కా బాప్‌

తెలుగులో బిజినెస్‌ ప్రొగ్రామ్స్‌లో ముఖ్యంగా షేర్‌ మార్కెట్‌ అనాలిసిస్‌, షేర్‌ రెకమెండేషన్స్‌లో ‘టీవీ5 బిజినెస్‌ బ్రేక్‌ఫాస్ట్‌’కు తిరుగు లేదు. ఎంతో
అనుభవజ్ఞులైన స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు వచ్చే ఈ ప్రొగ్రామ్‌కు తాజాగా వచ్చిన బాంబే అనలిస్ట్‌ రాజేష్‌ పాలవియా కొద్దివారాల్లో తెలుగువారికి అభిమాన అనలిస్ట్‌గా మారారు. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన రాజేష్‌ బాంబే నుంచి ఇస్తున్న రెకమెండేషన్స్‌ ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాలను
అందిస్తున్నాయి. సీఎన్‌బీసీ టీవీ18, సీఎన్‌బీసీ ఆవాజ్‌తో పాటు ఈటీ నౌ ఛానల్స్‌కు ఆయన ఇస్తున్న విశ్లేషణలను చూసిన బిజినెస్‌ ఎడిటర్‌ వసంత్‌కుమార్‌… రాజేష్‌ను తెలుగువారికి పరిచయం  చేశారు. మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా రాజేష్‌ సిఫారసులు సక్సెస్‌ కావడం చూస్తుంటే… ఆయనకు టెక్నికల్స్‌ ఉన్న పట్టు స్పష్టమౌతోంది. ముఖ్యంగా వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ అయిన ఇవాళ (గురువారం) ఆయన ఇచ్చిన రెండు ఆప్షన్‌ రెకమెండేషన్స్‌ ఇన్వెస్టర్లకు టార్గెట్‌కు మించి డబుల్‌ ప్రతిఫలాన్ని ఇచ్చాయి.
నిఫ్టి 25,200 దాటితే షార్ట్‌ కవరింగ్‌ వస్తే 25,400కు చేరుతుందని చెప్పిన రాజేష్‌.. ఇవాళ ఒక నిఫ్టి, ఒక బ్యాంక్‌ నిఫ్టి రెకమెండేషన్స్‌ ఇచ్చారు. వీటితో పాటు సర్వోటెక్‌ పవర్‌ అనే మిడ్‌ క్యాప్‌ షేర్‌ను కూడా ఇవాళ సిఫరాసు చేశారు. ట్రేడింగ్‌ కోసం మరికొన్ని షేర్లు చెప్పినా… పొజిషనల్‌ కోసం చెప్పిన షేర్‌ ఇదొక్కటే… ఇవాళ ఆయన రెకమెండేషన్స్‌ ఎలా పనిచేశాయో ఇపుడు చూద్దాం.

రాజేష్‌ ఇచ్చిన నిఫ్టి ఆప్షన్‌ ఇవాళ మంచి ప్రతిఫలాలను ఇచ్చింది. నిఫ్టి  25,150 లేదా 25,200 దాటితే 25400 దాకా వెళ్ళొచ్చని రాజేష్‌ చెప్పారు. 25200 దాటితే షార్ట్‌ కవరింగ్‌ వస్తుందని పసిగట్టారు. ఈ నేపథ్యంలో కూ డా ఆయన వచ్చేవారం కాంట్రాక్ట్‌ కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. 19 సెప్టెంబర్  నిఫ్టి 25,000 కాల్‌ ఆప్షన్‌ కొనమని సలహా ఇచ్చారు. రూ. 110-125 మధ్య కొని రూ.75 స్టాప్‌లాస్‌తో పొజిషన్‌ను కొనసాగించమని సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన టార్గెట్‌ రూ.200 నుంచి రూ.250. ఈ కాంట్రాక్ట్‌ ఇవాళ ఓపెనింగ్‌లోనే రూ. 168.95కి చేరినా.. తరవాత రూ. 145కు వచ్చింది. ఈ కాంట్రాక్ట్‌ గరిష్ఠ స్థాయి రూ. 200 లేదా రూ. 250గా రాజేష్‌ చెప్పినా… ఇవాళ ఆ ఆప్షన్‌ రూ. 447 గరిష్ఠ స్థాయిని తాకి… రూ. 391 వద్ద ముగిసింది. ఆయన చెప్పిన టార్గెట్‌కు దాదాపు డబుల్‌ లాభాలు ఇచ్చిందన్నమాట.
ఇక రాజేష్‌ ఇచ్చిన రెండో ఆప్షన్‌ బ్యాంక్‌ నిఫ్టిది. ఈనెల 18న ఫెడ్‌ వడ్డీ రేట్లను ప్రకటిస్తున్నందున… ఈ ఆప్షన్‌ కూడా 18 సెప్టెంబర్‌ వీక్లీ కాల్‌ కొనమని ఆయన సలహా ఇచ్చారు. బ్యాంక్‌ నిఫ్టి 51,200 స్ట్రయిక్‌తో ఉన్న 18 సెప్టెంబర్‌ కాల్‌ ఆప్షన్‌ను రూ. 265-రూ. 293 మధ్య కొనుగోలు చేయాలని రాజేస్‌ సలహా చేశారు. ఆయన ఇచ్చిన స్టాప్‌లాస్‌ రూ. 210. టార్గెట్‌ రూ.400 నుంచి రూ. 440. ఈ ఆప్షన్‌ కూడా ఇవాళ రూ. 395 వద్ద ఓపెన్‌ అయింది. తరవాత రూ 261 కనిష్ఠ స్థాయికి వచ్చింది. అంటే రాజేష్‌ రెకమెండ్‌ చేసిన ధరకు వచ్చింది. ఆయన ఇచ్చిన గరిష్ఠ టార్గెట్‌ రూ. 440 కాగా… ఇవాళ ఈ ఆప్షన్‌ రూ. 754 గరిష్ఠ స్థాయికి చేరింది. చివర్లో రూ.638 వద్ద ముగిసింది. ఈ ఆప్షన్‌ కూడా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. వచ్చే వారం కోసం ఇచ్చిన ఈ రెండు ఆప్షన్లు ఇవాళే భారీ లాభాలను తెచ్చి పెట్టడం విశేషం. ఇక ప్రొగ్రామ్‌ చివర్లో రాజేష్‌ ఇచ్చిన రెకమెండేషన్‌ ఈవీ రంగానికి చెందిన మిడ్‌ క్యాప్‌ షేర్‌ పర్వోటెక్‌ పవర్‌. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 142 కాగా రూ. 110 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన టార్గెట్‌ రూ. రూ. 180 నుంచి రూ. 200. ఈ షేర్‌ ఇవాళ రూ. 145.40 వద్ద ప్రారంభమై రూ. 144.45కి పడింది. అంటే కొనేందుకు ఇన్వెస్టర్లకు ఛాన్స్‌ ఇచ్చింది. చాలా సేపు రూ. 150లోపు ఉన్న ఈ షేర్‌ మిడ్‌ సెషన్‌ తరవాత 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ.157.25 వద్ద ముగిసింది. సో… ఆయన ఇచ్చిన ఫుల్‌ టార్గెట్‌ కూడా త్వరగా పూర్తయ్యే అవకాశం కన్పిస్తోంది.