For Money

Business News

సుంకాలపై ట్రంప్‌ వెనకడుగు

ఆటోమొబైల్‌ కంపెనీలపై ఈ నెలలో ట్రంప్‌ విధించిన సుంకాలపై అమెరికా కంపెనీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఈ సుంకాల్లో మార్పులు చేయాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశీ కార్ల దిగుమతులపై సుంకాలను తగ్గించాలని వైట్‌ హౌస్‌ నిర్ణయించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఇవాళ మిచిగాన్‌ పర్యటనకు వెళుతున్న ట్రంప్‌, పర్యటన ప్రారంభానికి ముందే దీనికి సంబంధించి ఓ ప్రకటనల చేస్తారని తెలుస్తోంది. పైగా ఇప్పటికే
కంపెనీలు కట్టిన సుంకాలను వెనక్కి ఇచ్చే అంశాన్ని కూడా ట్రంప్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విదేశీ ఫినిష్ట్‌ కార్ల దిగుమతిపై 25 శాతం సుంకాన్ని ట్రంప్‌ విధించారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో వాల్‌స్ట్రీట్‌ కోలుకుంది. ఒకదశలో ఒక శాతంపైగా నష్టపోయిన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.