For Money

Business News

ఇంకా సుంకాలు పెంచుతా

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. రష్యా నుంచి ఇంకా చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌ సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. ఉక్రయిన్‌లో రష్యా సృష్టిస్తున్న మారణహోమాన్ని భారత్‌ పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌పై అమెరికా ఇప్పటికే 25 శాతం సుంకంతో పాటు పెనాల్టిని విధించిన విషయం తెలిసిందే. తాను హెచ్చరికలు చేసినా… రష్యాను భారత్‌ చమురు దిగుమతులు ఆపకపోవడంతో ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు.  తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ట్రూత్‌ సోషియల్‌లో ట్రంప్‌ స్పందిస్తూ… రష్యా వార్‌ మెషిన్‌ ఎంతో మంది ఉక్రెయిన్‌ పౌరుల్ని చంపుతున్నా భారత్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.