అదాన్ డిస్టలరీస్ -అరబిందో కంపెనీదే!
ఎంపీ విజయసాయి రెడ్డి ఇన్నాళ్ళూ అదాన్ డిస్టలరీస్‌కు అరబిందో గ్రూప్‌కు సంబంధం లేదని చేసిన వాదన ఫేక్ అని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ మద్యం వ్యాపారం కూడా అరబిందో గ్రూప్‌దేనని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దాడుల్లో తేలింది. ఢిల్లీలో బినామీ కంపెనీల ద్వారా 30 శాతం వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తోంది ట్రైడెంట్ కెమ్‌ఫార్ అని తేలింది. ట్రైడెంట్ కెమ్ఫార్కి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కాశీచయనులు శ్రీనివాస్ చేత ఏపీలో అదానీ డిస్టిలరీస్‌ను పెట్టించారు. ఇందులో డైరెక్టర్లుగా ఉన్నవారు ఇద్దరూ బినామీలేనని తేలింది. పైగా అదాన్ డిస్టలరీస్‌కు కాశీచయనులు శ్రీనివాస్ రరూ.10 కోట్ల రుణం ఇచ్చినట్ల అదాన్ రికార్డుల్లో చూపారు. కాని నిన్న ఢిల్లీలో జరిగిన దాడుల్లో తేలిందేమిటంటే శ్రీనివాస్ ట్రైడెంట్ కెమ్‌ఫార్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని తేలింది. అతని కనుసన్నుల్లోనే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. పైగా అదాన్ డిస్టిలరీస్ కంపెనీ ఆడిటర్ కూడా అరబిందో గ్రూప్ కంపెనీల ఆడిటర్ కావడం విశేషం. అదాన్ కంపెనీ శ్రీనివాసులదేనని మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి చెప్పారు. తన అల్లుడుకు సంబంధం లేదని తెలిపారు. అయితే ట్రైడెంట్ కెమ్‌ఫార్ అంటే తమ వియ్యంకుల కంపెనీకి అతను సీఎఫ్ఓ అన్న విషయం దాచారు. రూ.35,800 బేసిక్ జీతంలో ట్రైడెంట్ కెమ్ఫార్లో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు అదాన్‌కు రూ. 10 కోట్ల రుణం ఇచ్చే ఆర్థిక స్థోమత ఎక్కడి నుంచి వచ్చింది? ట్రైడెంట్ కెమ్‌ఫార్ 2016 డిసెంబర్ 22న శ్రీనివాస్‌ను సీఎఫ్ఓగా నియమిస్తూ అన్ని అలవెన్స్‌లు కలిపి మొత్తం జీతం రూ. 75,008లుగా ఖరారు చేసింది. కంపెనీ రికార్డులు ప్రభుత్వానికి సకాలంలో సమర్పించడంలో విఫలమైందని కంపెనీల వ్యవహారాల శాఖ శ్రీనివాస్‌పై రూ.43,500 జరిమానా కూడా విధించింది. ఆ ఉత్తర్వుల్లో కూడా ట్రైడెంట్ కెమ్ఫార్లో కీలక వ్యక్తిగా పేర్కొనడమే గాక… అతను సీఎఫ్ఓగా పేర్కొంది. ఈడీ చేతికి అందిన దస్త్రాలను బట్టి చూస్తే ఢిల్లీలో ఎలాగైతే నిధుల సాయం చేసి బినామీ కంపెనీల ద్వారా మద్యం వ్యాపారం చేస్తున్నారో… ఏపీలో కూడా అదే విధంగా అదాన్ ముసుగులో అరబిందో మద్యం వ్యాపారం చేస్తోందన్నమాట.