For Money

Business News

పోన్లకు పేర్లతోనే కాల్స్‌ … నంబర్లతో కాదు

చాలా మందికి నంబర్లతో కాల్స్ వస్తాయి. తీయాలా? వొద్దా? అన్న మీమాంసం. వొద్దనుకుని ఒక్కోసారి ముఖ్యమైన కాల్స్‌ కూడా మిస్సవుతుంటారు. కొందరు ట్రూకాలర్‌ వాడుతారు. అందులో కూడా అవతల వ్యక్తి ఏ పేరుతో ఫోన్‌లో నంబర్‌ నోట్‌ చేసుకుంటారో ఉంటారో… ఆ పేరునే ట్రూకాలర్‌ చూపిస్తుంది. ఆ పేరు కూడా ఆ ఫోన్‌ యజమానిది కాకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది.ఈ ప్రతిపాదనను టెలికాం విభాగం ముందు పెట్టింది. ఈ ప్రతిపాదన ప్రకారం దేశంలో ఉన్న అన్ని ఫోన్ల నంబర్లతో ఓ వర్చువల్‌ డైరెక్టరీ తయారు అవుతుంది. దీని ద్వారా ఏ కాల్‌ చేసినా… నంబర్‌ కాకుండా ఆ డైరెక్టరీలో ఉన్న ఫోన్‌ యజమాని పేరు వస్తుంది. కాబట్టి ఫోన్‌ తీయాలో వొద్దో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫోన్‌ నంబరు, పేరు కూడా కేవీసీ (KYC-Know Your Customer)ను పరిశీలించిన తరవాత డైరెక్టరీలో నమోదు చేస్తారు. అంటే ఫోన్‌ నంబర్‌, పేరు రెండు ఒక్కరివే అని తేలిన తరవాతే నమోదు చేస్తారన్నమాట. ఎటూ కనెక్షన్స్ ఇచ్చే ముందు కేవీసీని పరిశీలించే బాధ్యత టెలికాం కంపెనీలదే కాబట్టి. దీని కోసం టెలికాం విభాగం ప్రత్యేకంగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. వాటి నుంచి కస్టమర్ల డేటా తీసుకుంటే చాలు. కొత్త వ్యవస్థ వల్ల స్పామ్‌ కాల్స్‌, మార్కెటింగ్‌ కాల్స్‌ బారి నుంచి తప్పించుకోవచ్చు. మరి ఇది అమలు కావడానికి ఎంత కాలం పడుతుందో చూడాలి.