NIFTY TRADE: 17,500 స్టాప్‌లాస్
మార్కెట్‌కు ఇపుడు 17500 గేమ్ ఛేంజర్‌గా పనిచేస్తుందని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు.ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టి బలంగా ఉంటుందని అన్నారు. విక్స్ (VIX) భారీగా తగ్గడం కూడా మార్కెట్‌కు అనుకూలమని అన్నారు. అలాగే నిఫ్టి పడినపుడు కొనుగోలుకు ఇన్వెస్టర్లు ప్రయత్నించాలని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మెల్లగా తమ ఫ్యూచర్స్‌ను కవర్ చేసుకుంటున్నారని.. ఇది సానుకూల అంశమని వీరేందర్ అంటున్నారు. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు కేవలం రూ. 22 కోట్ల మాత్రం నికర అమ్మకం దారులుగా ఉన్నారు. అత్యధిక ట్రేడింగ్ ఇండెక్స్ ఆప్షన్స్‌లో రూ. 3338 కోట్లు నికర కొనుగోళ్ళు చేశారు. అలాగే స్టాక్ ఫ్యూచర్స్లోరూ. 2107 కోట్లు కొనుగోలు చేశారు. వీరేందర్ కుమార్ అంచనా ప్రకారం నిఫ్టికి 17661 లేదా 17710 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది. ఈ స్థాయిలను దాటితే 17743 లేదా 17810 వరకు కూడా వెళ్ళే అవకాశముంది. ఇక డౌన్‌సైడ్‌లో సపోర్ట్…17524 లేదా 17466 వద్ద లభించే అవకాశముంది. ఇతర వివరాలకు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=Z-SOkfYTZ0A