For Money

Business News

రికార్డుస్థాయికి వాణిజ్య లోటు

ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్‌ వాణిజ్యలోటు 2,429 కోట్ల డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఈ స్థాయి వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే ప్రథమం. మే నెలలో ఎగుమతులు 20.55 శాతం వృద్ధితో 3894 కోట్ల డాలర్లకు చేరగా, దిగుమతులు భారీగా 62.83 శాతం పెరిగి 6,322 కోట్ల డాలర్లకు పెరిగాయి. దీంతో వాణిజ్యలోటు 2,429 కోట్ల డాలర్లకు చేరింది. గత ఏడాది మే నెలలో లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా విదేశీ వాణిజ్యం మందగించడంతో 653 కోట్ల డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యింది. ఈ ఏడాది మే నెలలో పెట్రోలియం, ముడి చమురు దిగుమతులు ఏకంగా 102.72 శాతం పెరిగి 1920 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. బంగారం దిగుమతులు కూడా 600 కోట్ల డాలర్లకు పెరిగాయి. 550 కోట్ల డాలర్ల విలువైన బొగ్గు, కోక్‌ భాతర్‌ దిగుమతి చేసుకుంది. ఏప్రిల్‌ నెలకంటే మే నెలలో చమురుయేతర ఎగుమతులు తగ్గడం, బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు పెరగడానికి మరో కారణమని ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌చెప్పారు.