For Money

Business News

మద్యం షేర్లకు ‘ఏపీ పాలసీ’ కిక్‌

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పెరిగిన షేర్లలో హెరిటేజ్‌తో పాటు పలు మద్యం కంపెనీల షేర్లు. ముఖ్యంగా తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, రాడికో ఖైతాన్‌, గ్లోబస్‌ స్పిరిట్స్‌ వంటి షేర్లు భారీగా పెరిగాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ రంగానికి చెందిన షేర్లు దాదాపు 30 శాతంపైగా పెరిగాయి. మద్యం దుకాణాల నిర్వహణ పూర్తిగా పాత పద్ధతిలో అంటే ప్రైవేటుకు అప్పజెప్పాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. పాత పద్ధతిలో అంటే వేలం ద్వారా ఈ దుకాణాలను కేటాయిస్తారు. అలాగే అన్ని రకాల మద్యం బ్రాండ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే

ప్రస్తుతం సగటు మద్యం ధర రూ.147 గా ఉండగా, దీన్ని రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో మధ్య తరహా కంపెనీలు కూడా ఏపీలో పడే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు తమ బ్రాండ్లు ఏపీ లేనందున… యునైటెడ్‌ బ్రూవరీస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కంపెనీలు బాగా లబ్ది పొందనున్నాయి. తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్ కంపెనీ టర్నోవర్‌లో సగం వ్యాపారం ఏపీ, తెలంగాణ నుంచే వస్తుంది. దీంతో ఈ కంపెనీలు తమకు పూర్వ వైభోగం వస్తుందని ఆశిస్తున్నాయి. మద్యం సరఫరా కోసం ఏపీ వద్ద వందకుపైగా కంపెనీలు నమోదు చేసుకున్నా… జగన్‌ తనకు అనుకూలంగా ఉన్న కంపెనీల నుంచి బ్రాండ్లను కొన్నారు. పైగా ప్రీమియం, ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్లను దూరంగా ఉంచారు. ఇపుడు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో… మద్యం కంపెనీల వ్యాపారం మళ్ళీ పాత స్థాయికి చేరే అవకాశముంది. పైగా ఈ రంగంలో అనేక కొత్త కంపెనీలు రావడంతో… మార్కెట్‌లో పోటీ పెరిగి.. వినియోగదారులకు కూడా లాభం చేకూరే అవకాశం ఏర్పడింది.

Leave a Reply