ఇన్ఫీబీమ్ ఫైనాన్షియల్ చీఫ్ హత్య
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ఇన్ఫీబీమ్ కు చెందిన కార్పొరేట్ ఫైనాన్స్ హెడ్ ఆర్ శ్రీకాంత్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన భార్యను కూడా హత్య చేశారు. జియో ఇన్ఫోకామ్, పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో కూడా శ్రీకాంత్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. నిన్న శ్రీకాంత్ దంపతులు అమెరికా నుంచి చెన్నైకు తిరిగి వచ్చారు. నిన్న వీరి హత్య జరగ్గా, ఇవాళ హంతకుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. వారిని హత్య చేసింది … వారి వద్ద పదేళళుగా పనిచేస్తున్న డ్రైవర్ కృష్ణ అని తెలియడం పోలీసులు ఆశ్చర్యపోయారు.
దొరికిపోయాడు
హత్య తరవాత రవి భారీగా బంగారం, నగదుతో పరారయ్యారు. హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్‌పై అనుమానంతో.. అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు కృష్ణ పట్టుబడ్డాడు.
చెన్నై మైలాపూర్ బృందావన్ నగర్ ద్వారకా కాలనీకి చెందిన ఆడిటర్ శ్రీకాంత్ (60), ఆయన భార్య అనురాధ (55) మార్చి నెలలో అమెరికాలో ఉంటున్న వారి కూతురు సునంద వద్దకు వెళ్లారు. నిన్న తెల్లవారుజామున వారు అమెరికా నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకున్న డ్రైవర్ కృష్ణ వారిని ఇంటికి తీసుకెళ్లి దింపాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి సునంద తన తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సునంద సన్నిహితులకు విషయం చెప్పింది. దీంతో వారు ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో వారు మైలాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. కొన్ని గదుల్లో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో పోలీసుల విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌కు ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్)లోని నెమ్మెలిలో ఫామ్ హౌస్ ఉందని తెలిసి అక్కడ గాలింపు చేపట్టారు. ఫాస్ట్ ట్యాగ్ కాల్ డేటా సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఇద్దరి మృతదేహాలను ఫామ్ హౌస్‌లో పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఈ హత్యలో కృష్ణతో పాటు అతని స్నేహితుడు రవి కూడా పాల్గొన్నారు. వేర్వేరు గదుల్లో భార్యభార్తలను ఇనుప రాడ్లతో చంపి… బెడ్‌షీట్స్‌లో వారి మృతదేహాలను కప్పి… వారి ఫామ్ హౌస్‌కు తీసుకెళ్ళి పూడ్చేశారు.
కాల్ వివరాలు…
వెంటనే పోలీసులు శ్రీకాంత్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి వచ్చిన సందేశాలు.. కాల్ వివవరాల ద్వారా.. శ్రీకాంత్ కారు చెన్నై-కోల్‌కతా జతీయ రహదారిపై వెళ్తున్నట్టుగా గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులను అలర్ట్ చేశారు. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ యం.లక్షణ్, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా వాహనాలు తనిఖీ చేపట్టారు. కారు నంబరు ముందుగానే తెలియడంతో.. నిన్న సాయత్రం ఆరు గంటలకు కారు రాగానే టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. అందులో ఉన్న కృష్ణ, రవిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సూట్‌కేసుల్లో ఉన్న నగలు, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.తాము దోచుకున్న సొత్తు విలువ రూ.40 కోట్లు ఉంటుందని కృష్ణ అంచనా వేశాడు. అయితే నిధులన్నీ బ్యాంకుల ద్వారా బదిలీ చేసేసినట్లు గుర్తించారు. దీంతో 8 కిలోల బంగారం, 50 కిలోల వెండితో పరారయ్యారు.
ముందుగానే గోతులు..
శ్రీకాంత్ దంపతులను హత్య చేయాలని కృష్ణ ముందుగానే ప్లాన్ చేసి ఉంటాడని.. అందుకే ముందుగానే వారిని పాతిపెట్టేందుకు అనువుగా గొయ్యి తీసి ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నేపాల్‌కు చెందిన కృష్ణ గత పదేళ్ళుగా శ్రీకాంత్ దంపతుల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు నెమ్మెలిలోని శ్రీకాంత్ ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారు. అయితే గత నెలలో కృష్ణ.. వారిని తిరిగి నేపాల్‌కు పంపించాడు. ఇక, కృష్ణతో పాటుగా పట్టుబడిన రవిని డార్జిలింగ్‌కు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.