For Money

Business News

సంజీవ్‌ భాసిన్‌ బెట్స్‌

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌, ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ షార్ట్‌ టర్మ్‌లో మూడు షేర్లు కొనేందుకు సిఫారసు చేశారు. జీ బిజినెస్‌ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌ కొనడానికి ఆయన సిఫారసు చేశారు. ఈ షేర్‌ రూ.1530 స్టాప్‌లాస్‌తో రూ. 1700 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని అన్నారు. అలాగే ఆయన రెకమెండ్‌ చేసిన మరో షేర్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌. ఈ షేర్‌ను రూ. 1930 స్టాప్‌లాస్‌తో రూ. 2030 టార్గెట్‌ కోసం కొనాలని ఆయన అంటున్నారు. ఇక చివరి రెమెండేషన్‌ భారతీ ఎయిర్‌టెల్‌. ఈ షేర్‌ను రూ. 830 స్టాప్‌లాస్‌తో రూ. 900 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని అన్నారు.