ఆ అదానీ షేర్లపై MSCI వేటు?
ఆ మూడు షేర్లు అదానీ గ్రూప్‌కు తలనొప్పిగా మారాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక వచ్చిన తరవాత అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ప్రతిరోజూ లోయర్ సీలింగ్‌తో ఈ షేర్లు ముగుస్తున్నాయి. ముఖ్యంగా అదానీ టోటల్ షేర్ 72 శాతంపైగా నష్టపోయింది. ఈ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 40 కోట్ల డాలర్లు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఈ షేర్లను MSCI ఇండయా ఇండెక్స్ నుంచి తొలగించే అవకాశముంది. మే నెలలో వీటిని తొలగించవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 24న రూ. 108.70 ఉన్న అదానీ వపర్ రూ. 432ను తాకిన తరవాత వరుసగా లోయర్ సీలింగ్‌లతో రూ. 140కి చేరింది. ఈ ధర వద్ద కూడా కొనుగోలుదారులు లేరు. అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర రూ. 4000 నుంచి రూ. 1076కి పడింది. ఈ ధర వద్ద కూడా కొనేవారు లేరు. అదానీ ట్రాన్స్మిషన్దీ అదే పరిస్థితి. ఈ షేర్ రూ. 4256 నుంచి రూ. 1017కి పడింది. ఇవాళ కూడా ఈ షేర్‌ను కొనేవారు లేరు. అయితే ఈ షేర్లలో డెలివరీ 90 శాతంపైగా ఉన్నా… ఇంకా అమ్మకం దారులు ఉన్నారు.