నేడు ‘ఆమ్ ఆద్మీ’ బడ్జెట్?

ఢిల్లీ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు లేకున్నా… మిడిల్ క్లాస్ టార్గెట్‌గా ఇవాళ పలు రకాల పన్ను రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోంది. ప్రధానంగా కొత్త పన్ను విధానంలో అనేక మార్పులను ఇవాళ నిర్మలమ్మ ప్రవేశ పెట్టే అవకాశముంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్‌ను భారీగా పెంచే అవకాశముంది. తద్వారా జనం వద్ద సొమ్ము మిగులుతుందని, అదే ఆర్థికవృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తుందని నిర్మలమ్మ భావిస్తున్నట్లు జాతీయ మీడయా రాస్తోంది. గత బడ్జెట్లో మూలధన పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఆమేరకు నిధులు ఖర్చు చేయలేకపోయింది. ఈసారి కూడా గత ఏడాది స్థాయిలోనే ఈ కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌కు ప్రత్యేకంగా ఎలాంటి రాయితీలు ఉండవని సమాచారం. దీంతో ఈ బడ్జెట్ పూర్తిగా మిడిల్ క్లాస్, వేతన జీవులను టార్గెట్‌గా ఉండే అవకాశముంది.