1 నుంచి సినిమాల షూటింగ్‌ల బంద్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని తెలుగుఉ సినీ నిర్మాతల మండలి నిర్ణయించింది. ఇవాళ హైదరాబాద్‌లో సమావేశమైన తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పెద్ద హీరోల సినిమాల నిర్మాణం కూడా ఆగిపోనుంది. ఇపుడు కొన్ని భారీ సినిమాల షూటింగ్ జరుగుతోంది. ఇపుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కరించే అవకాశముంది. ఎందుకంటే షూటింగ్‌లు వాయిదా పడే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతోంది. షూటింగ్‌లు ఆపితేనే అన్ని సమస్యలపై చర్చ జరిగి, తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా షూటింగ్‌లు జరుగుతూ ఈ సమస్యలకు పరిష్కారం సాధించడం కష్టమని, అందుకే షూటింగ్ నిలిపివేయాలని నిర్ణయించారు. తాజా నిర్ణయంతో సినిమాలోని ఇతర విభాగాలు కూడా ఈ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశముంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే ఓటీటీకి సంబంధించిన కూడా కొన్ని కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని… పరిమిత బడ్జెట్‌లో తీసిన సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చని నిర్ణయించారు. రూ .6 కోట్లలోపు బడ్జెట్ చిత్రాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవాలి నిర్రణయించారు. సినిమా టికెట్ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదించింది .