For Money

Business News

‘టెక్‌’ బుడగ పేలుతోందా?

కరోనా మహమ్మారి దాడి ప్రారంభమైన తరవాత తొలిసారి అమెరికా మార్కెట్‌లో ఎన్నడూ లేనివిధంగా టెక్‌ షేర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. నాస్‌డాక్‌ భారీ నష్టాలతో ముగిసింది. ఈ పతనంలో నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ 34 శాతం క్షీణించడం ఇన్వెస్టర్లను కలవర పరస్తోంది. టెక్‌, ఐటీ షేర్లకు పెద్ద మద్దతు అందడం లేదు. నిన్న రాత్రి కూడా నాస్‌డాక్‌ 2.72 శాతం నష్టంతో క్లోజైంది. ఫ్యూచర్స్ కూడా రెండు శాతం నష్టంలో ఉంది. ఇలా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా రెండు శాతం దాకా నష్టపోగా, డౌజోన్స్‌ నష్టాలు 1.3 శాతానికి పరిమితమయ్యాయి. కంపెనీ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మున్ముందు పరిస్థితి ఆశాజనకంగా లేదని కంపెనీ హెచ్చరించడంతో రాత్రి నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ 21.8 శాతం క్షీణించింది. దీంతో ఇతర షేర్లలోనూ ఒత్తిడి వచ్చింది. వాల్ట్ డీస్నీ షేర్‌ 7 శాతం క్షీణించింది. కేవలం ఒక్క వారంలో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 5.7 శాతం, డౌ జోన్స్‌ 4.6 శాతం, నాస్‌డాక్‌ 7.6 శాతం క్షీణించాయి. డౌజోన్స్‌ వరుసగా ఆరు సెషన్స్‌లో పడటం 2020 ఫిబ్రవరి తరవాత ఇదే మొదటిసారి. ఈ వారం యాపిల్‌, టెస్లా, మైక్రోసాఫ్ట్‌ కంపెనీల ఫలితాలు ఉన్నాయి.