For Money

Business News

18 ఏళ్ళ తరవాత టాటాల నుంచి ఐపీఓ

టాటా గ్రూప్‌ నుంచి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి చివరి కంపెనీ- టీసీఎస్‌. 2004లో ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. తరవాత టాటా గ్రూప్‌ నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా ఐపీఓ జారీ చేయలేదు. ఇపుడు టాటా ప్లే (పాత పేరు టాటా స్కయ్‌) కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. కాన్పిడెన్షియల్‌ ప్రి ఫైలింగ్‌ రూట్‌లో ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది.దీని ప్రకారం వ్యాపార పరంగా సున్నిత సమాచారానికి సంబంధించిన పత్రాలను కంపెనీ బహిర్గతం చేయలేదు. సెబి నుంచి అనుమతి వచ్చిన తరవాత పబ్లిక్ ఆఫర్‌ సమయంలో ఆ సమాచారాన్ని బయట పెడుతుంది. మార్కెట్‌ నుంచి రూ. 2000 కోట్లు లేదా రూ. 2500 కోట్లు సమీకరించేందుకు టాటా ప్లే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీలో ఉన్న ఇతర భాగస్వాములు తమ షేర్లను అమ్ముకుంటారు. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్‌, టాటా ఆపర్య్చునిటీస్‌ ఫండ్‌, వాల్ట్‌ డీస్నీలకు కలిపి కంపెనీలో 37.8 శాతం వాటా ఉంది. వాల్ట్‌ డీస్ని కొంత వాటాను అమ్ముతుండగా, మిగిలిన రెండు కంపెనీలు పూర్తిగా తమ వాటాను అమ్మేయనున్నాయి.