డార్క్ ఎడిషన్‌గా అల్రోజ్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు అల్ట్రోజ్ ‘డార్క్’ ఎడిషన్‌ను టాటా మోటర్స్ విడుదల చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ తెచ్చింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.7.96 లక్షలుగా నిర్ణయించింది. ప్రజాదరణ పొందిన ఫీచర్స్‌తో ఈ మోడల్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన రెండేండ్లలో 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.