టాటా మోటార్స్ చేతికి ఫోర్డ్ యూనిట్?
గత ఏడాది భారత మార్కెట్ నుంచి ఫోర్డ్ మోటార్ కంపెనీ వైదొలగింది. ఈ కంపెనీకి గుజరాత్‌లోని సనంద్‌లో తయారీ యూనిట్ ఉంది. ఈ యూనిట్‌ను టేకోవర్ చేసేందుకు టాటా మోటార్స్ ముందుకు వచ్చింది. రెండు కంపెనీలు ఈమేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరాయి. టాటాలు ప్లాంట్ తీసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి రేపు అహ్మదాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఎంఓయూ కుదరనుంది. అయితే ఫోర్డ్ నుంచి ఏ ధరకు కొనుగోలు చేయాలి? ఉద్యోగుల, ఆర్థిక అంశాలు.. వంటి వాటిపై ఇంకా టాటా మోటార్స్, ఫోర్డ్ మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంది.