టాటా మోటార్స్ భారీ జంప్?
ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయడంతో పాటు కేవలం 10 శాతం వాటాను రూ.7500 కోట్లకు విక్రయంచడంతో టాటా మోటార్స్ షేర్ రీ రేటింగ్ జరుగుతోంది. టాటా మోటార్స్ ఏడీఆర్‌లు రాత్రి 12.90 శాతం లాభంతో 31.68 డాలర్ల ముగిసింది. ఒకదశలో ఏడీఆర్ 32 డాలర్లను కూడా చేరింది. ట్రేడింగ్ తరవాత కూడా టాటా మోటార్స్ క్రితం ముగింపు వద్ద ట్రేడవుతోంది. ఇవాళ కూడా మన మార్కెట్లలో టాటా మోటార్స్ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. అయితే విశ్లేషకులు మాత్రం ప్రస్తుత ధర వద్ద ఈ షేర్‌ను కొనాల్సిన అవసరం లేదని సలహా ఇస్తున్నారు. షేర్‌లో కరెక్షన్ కోసం ఎదురు చూడాలని అంటున్నారు.