టియాగో ఈవీ రూ. 8.49 లక్షలు
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్లో అతి తక్కువ ధరకు కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. టాటా టియాగో ఈవీ ప్రారంభం ధర రూ. 8.49 లక్షలని కంపెనీ పేర్కొంది. ఈ కారు ధర యాక్సిసరీస్ను బట్టి రూ. 11.8 లక్షలని పేర్కొంది. అయితే తొలి పది వేల మంది కస్టమర్లకు రూ. 8.49 లక్షలకే కారును విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.