టాటా గ్రూప్ బిడ్ ఒక్కటే
రుణ ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను అమ్మడానికి డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగిసింది. ఈ గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే ప్రకటించారు. టాటా గ్రూప్ ఒక్కటే ఎయిర్ ఇండియా కోసం బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు రూ. 43,000 కోట్ల రుణం ఉండగా, అందులో రూ. 22,000 కోట్లను ఎయిర్ ఇండియా అసెంట్ హోల్డింగ్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా వంద శాతం వాటా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో భాగంగా ముంబైలోని ఎయిర్ ఇండియా భవనం, ఢిల్లీలోని ఎయిర్‌లైన్స్ హౌస్ కూడా అమ్మేయనుంది.