టీ వర్క్స్ ప్రారంభం
దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారు టీ-వర్క్స్‌కు వస్తే, వారి ఆలోచనలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకొనే అవకాశం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ-హబ్, టీ-వర్క్స్ చేశారు. త్వరలోనే ఇమేజ్ టవర్‌ను ఏర్పాటు చేస్తారు. టీ-వర్క్స్ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.