For Money

Business News

స్విగ్గీవన్‌ అన్ని డెలివరీలు ఫ్రీ

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ‘స్విగ్గీ వన్’ ప్రోగ్రామ్‌లో లభిస్తున్న ప్రయోజనాలను విస్తరించింది. ఇప్పటి వరకు ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫ్రీ ఫుడ్ డెలివరీలను అందిస్తుండగా .. ఇకపై ఏ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నా ఉచితంగా డెలివరీ చేయనున్నారు. అయితే రెస్టారెంట్ 10 కి.మీ. లోపు ఉండాలి. అలానే ఆర్డర్ విలువ కనీసం రూ.149 ఉండాలి. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ రూ . 99 కంటే ఎక్కువ విలువ కలిగిన ఆర్డర్లపై ప్రీ డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నారు .
సబ్‌స్క్రిప్షన్‌ ఫీ ఉంటుంది
స్విగ్గీ వన్ సబ్‌స్క్రిప్షన్‌ పొందాలంటే ఏడాదికి రూ. 7,899 చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలలకైతే రూ.3,299 చెల్లించాలి. ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారుఉ జూన్ 2 నుంచి కొత్త ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే , ఎంపిక చేసిన కొత్త కస్టమర్లకు కేవలం 49 కే 15-30 రోజుల ప్రీ ట్రయల్ కూడా అందిస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది పత్రికా ప్రకటనలో పేర్కొంది.