బ్రిటన్ ప్రధానిగా రుషి సునాక్?
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్సర్వేటివ్ పార్టీ నాయకునిగా పోటీ చేయడం లేదని తేల్చేశారు. దీంతో బ్రిటన్ ప్రధాని రుషి సునాక్‌ను మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సగానికిపైగా ఎంపీలు రుషికి మద్దతుగా నిల్చినట్లు బీబీసీ వార్తా సంస్థ పేర్కొంది. రాత్రి 6.30 గంటలకు కాబోయే ప్రధానికి సంబంధించి పూర్తి స్పష్టత రానుంది. రిషికి పోటీగా నిలవాలని అనుకుంటున్న పెన్ని మార్డన్స్ కనీసం ఎంపీల మద్దతు కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. రిషికి పోటీగా నిలబడాలంటే కనీసం వంద మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంది. మరికాస్సేపట్లో డెడ్‌లైన్ పూర్తికానుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతుగా నిలిచిన ఎంపీలు ఇపుడు రుషికి మద్దతుగా నిలుస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప … రుషి సునాక్‌కు ప్రధాని కాకుండా ఆపడం కష్టంగా కన్పిస్తోంది.