For Money

Business News

సన్‌ ఫార్మా షాక్‌

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సన్‌ ఫార్మా కనీసం రూ.1,707 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే రూ. 9385 కోట్ల టర్నోవర్‌ వస్తుందని లెక్క గట్టారు.అయితే కంపెనీ ఇవాళ ఇదే త్రైమాసికంలో రూ. 9446 కోట్ల ఆదాయంపై రూ. 2,277 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కంపెనీ టర్నోవర్‌ విశ్లేషకులు అంచనాలను మించినా… నికరలాభం షాక్‌ ఇచ్చింది. గత ఏడాదిలో కంపెనీ రూ.9386 కోట్ల ఆదాయంపై రూ. 848 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సెటిల్‌మెంట్లు, రాన్‌బాక్సీ, టారో ఫార్మాకు సంబంధించిన ప్రొవిజన్స్‌లకు రూ.3935 కోట్లు కేటాయించడంతో కంపెనీ రూ. 2227 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో EBITDA రూ. 2279 కోట్లని సన్‌ ఫార్మా వెల్లడించింది. ఫలితాల తరవాత కంపెనీ షేర్‌ 1.65 శాతం నష్టంతో ర ఊ .889 వద్ద ముగిసింది.