దిగువ స్థాయిలో నిఫ్టి కొనుగోలు చేయండి
మార్కెట్‌కు ఇవాళ దిగువస్థాయిలో మద్దతు లభించే అవకాశముందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అభిప్రాయపడ్డారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… మార్కెట్ ప్రారంభమైన వెంటనే కొనుగోలు చేయొద్దని… నిఫ్టి పడిన తరవాత కొనుగోలు చేయమని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టికి 15600 లేదా 15550 ప్రాంతంలో కొనుగోలు చేయమని చెప్పారు. అయితే నిఫ్టిలో ర్యాలీ రాదని, కేవలం ఒక్రటెండు రోజుల్లో స్వల్ప లాభాలతో బయటపడమని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆకర్షషణీయ లాభాల కోసం అట్ ద మనీ కాల్స్ కొనుగోలు చేయమని సిఫారసు చేశారు. 15700 కాల్‌ను కొనుగోలు చేయమని ఆయన తెలిపారు. షేర్లలో బజాజ్ఆటోను కొనుగోలు చేయొచ్చని… ఈ షేర్ డే ట్రేడింగ్‌కే గాకుండా.. పొజిషనల్ ట్రేడ్‌గా కొనుగోలు చేయొచ్చిన అన్నారు. ఆయన సిఫారసు చేసిన మరో షేర్ దివీస్ ల్యాబ్. ఈ షేర్లో ఆకర్షణీయ లాభాలు ఉంటాయని చెప్పారు. అయితే ఇది కేవలం ఒట్రెండు రోజుల కోసమేనని ఆయన పునరుద్ఘాటించారు.