For Money

Business News

పతనం ఖాయం… పుట్స్‌ కొనండి

మార్కెట్‌ మున్ముందు కొత్త కనిష్ఠ స్థాయిలను తాకుతుందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు సుదర్శన్‌ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ 18తో మాట్లాడుతూ… ఇన్వెస్టర్లు పుట్స్‌ కొనుగోలు చేయడం లాభదాయకమని అన్నారు. డే ట్రేడింగ్‌ కోసమే గాక, పొజిషనల్ ట్రేడింగ్‌ కోసం కూడా నిఫ్టి పుట్స్‌ కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. నిఫ్టి ఏమాత్రం పెరిగినా నిలబడటం అనుమానమే అని అన్నారు. నిఫ్టి వచ్చే వారం కూడా భారీగా క్షీణించే అవకాశముందని అన్నారు. టెక్నికల్‌గా కూడా నిఫ్టి బలహీనంగా ఉందన్నారు.