For Money

Business News

ఇవాళ ఈ షేర్లను గమనించండి

ఇవాళ్టి ట్రేడింగ్‌లో కొన్ని షేర్లపై కన్నేయండి. వీటి షేర్లలో హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉండే అవకాశముంది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఈ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 298.98 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 398.01 కోట్లు. అలాగే ఆదాయం కూడా రూ. 2,756.93 కోట్ల నుంచి రూ. 2,130.44 కోట్లకు క్షీణించింది.
డాబర్‌ ఇండియా
ఈ కంపెనీ నిన్న ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఇవి మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో కంపెనీ రూ. 504 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 2.2 శాతం పెరిగింది.
హెచ్‌డీఎఫ్‌సీ

హసింగ్‌ డెవలప్మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (HDFC) కూడా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,260.7 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాల కంటే అధికం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 11.4 శాతం పెరిగింది.
టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌

ఈ కంపెనీ కూడా డిసెంబర్‌ త్రైమాసికంలో రూ. 265.05 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 218.17 కోట్లు. ఆదాయం కూడా రూర. 3,069.56 కోట్ల నుంచి రూ. 3,208.38 కోట్లకు పెరిగింది.
అపోలో టైర్స్‌
డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం భారీగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే రూ. 443.8 కోట్ల నుండి రూ. 223.54 కోట్లకు పడిపోయింది. ఆదాయం మాత్రం రూ. 5,194.66 కోట్ల నుండి రూ. 5,707.47 కోట్లకు పెరిగింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
కెనరా హెచ్‌ఎస్‌బిసి ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పీఎన్‌బీకి ఉన్న వాటాను హెచ్‌ఎస్‌బిసి ఇన్సూరెన్స్ (ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ కొనుగోలు చేసింది.

భారత్ డైనమిక్స్
భారత సైన్యానికి Konkurs-M యాంటీ ట్యాంక్ క్షిపణుల సరఫరా కోసం కంపెనీ రూ. 3,131.82 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది.

త్రివేణి ఇంజనీరింగ్
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 130.12 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 94.66 కోట్లు. ఆదాయం స్వల్పంగా రూ. 1,123.08 కోట్ల నుండి రూ. 1,235.44 కోట్లకు పెరిగింది.