కరోనా దెబ్బకు 17,700 దిగువకు
అమెరికా మార్కెట్ డేటాతో సతమతమౌతున్న స్టాక్ మార్కెట్‌కు దేశీయ కరోనా డేటా మరింత దెబ్బ తీస్తోంది. నిఫ్టి దాదాపు 17780 ప్రాంతంలో ట్రేడవుతున్న సమయంలో కరోనా డేటా వచ్చింది. నిన్న ఒకే రోజు ఏకంగా 90వేలకు పైగా కేసులు నమోదు కావడంతో నిఫ్టిలో ఒత్తిడి వచ్చింది. నిఫ్టి 17,671కి పడింది. అక్కడి నుంచి కోలుకుని 17721 వద్ద ట్రేడవుతోంది. ఒమైక్రాన్ వల్ల పెద్ద తలనొప్పి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించినా… నిజానికి ఒమైక్రాన్ కంటే డెల్టా కేసులే భయపడుతున్నాయి. మిడ్ క్యాప్ షేర్లుకాస్త నిలదొక్కు కుంటున్నా… బ్యాంక్ నిఫ్టి, నిఫ్టిలో ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా అదానీ పోర్ట్స్ నిఫ్టి టాప్ లూజర్‌గా నిలిచింది.