విలీనానికి ఎక్స్ఛేంజీలు ఓకే
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ విలీన ప్రతిపాదనకు స్టాక్ ఎక్స్ఛేంజీలు తమ ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్, కంపెనీ వాటాదార్లతో పాటు కంపెనీ రుణదాతల ఆమోదం లభించాల్సి ఉంది. విలీన ప్రతిపాదనలను ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన HDFC, HDFC బ్యాంకులు ప్రకటించాయి. 25 HDFC షేర్లకు 42 HDFC బ్యాంక్ షేర్లు కేటాయించేలా విలీన ప్రతిపాదన చేశాయి. విలీనం తీరవాత కంపెనీ ఆస్తుల విలువ రూ .17.87 లక్షల కోట్లకు చేరుతుంది. అలాగే నెట్వర్త్ రూ. రూ .3.3 లక్షల కోట్లుకు చేరుతుందని ఈ సంస్థలు ప్రకటించాయి.