For Money

Business News

రూ. 81000 దాటిన పసిడి

అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌ జోరు మీద ఉంది. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన బులియన్‌ ధరలు ఇవాళ కీలక స్థాయిలను దాటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలహీనపడటంతో అమెరికా మార్కెట్‌లో ఇవాళ ఔన్స్‌ బంగారం ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 2700 డాలర్లను దాటింది. దేశీయంగా పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌ కావడంతో కొనుగోళ్ళు భారీగా పెరిగాయి. దీంతో ఇవాళ పది గ్రామల స్టాండర్డ్‌ 999 నాణ్యత గల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 81,000ను దాటింది. మలబార్‌ గోల్డ్‌ కాయిన్‌ ఇపుడు ఆన్‌లైన్‌లో రూ. 81,300కు ఆఫర్‌ చేస్తున్నారు. అదే షాప్‌లో కొంటే 4 శాతం డెయింగ్‌ చార్జీలు, 3 శాతం జీఎస్టీ కూడా ఉంటుంది.
వెండికీ పసిడితో సమానంగా డిమాండ్‌ కొనసాగుతోంది. కిలో వెండి తాజాగా మరో వెయ్యి రూపాయలు పెరిగి రూ.94వేల మార్కు చేరుకోవడం గమనార్హం.