For Money

Business News

నష్టాలతో లిస్ట్‌ కానున్న శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌

శ్రీరామ్‌ గ్రూప్‌నకు చెందిన శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ కానుంది. రూ. 118లకు ఈ కంపెనీ షేర్లను అలాట్ చేసింది. అనధికార మార్కెట్‌లోఉన్న ప్రీమియం శుక్రవారం మాయమైపోయింది. రేపు కనీసం 10 శాతం వరకు డిస్కౌంట్‌తో ఈ షేర్‌ లిస్ట్‌ కావొచ్చని భావిస్తున్నారు. ఈ ఇష్యూ 4.6 శాతం ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయినా సెకండరీ మార్కెట్‌ బలహీనంగా ఉండటంతో నష్టాలతో ఓపెన్‌ అయ్యే అవకాశముంది. కంపెనీ ఆర్థిక మూలాలు కూడా బలహీనంగా ఉండటంతో దీర్ఘాకాలిక లాభాలకు ఈ షేర్‌ను బ్రోకింగ్‌ సంస్థలు కూడా రెకమెండ్‌ చేయలేదు. దిగువ స్థాయిలో కొనుగోలు మద్దతు అందే అవకాశముంది.