For Money

Business News

శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌: తొలి రోజే 25% కట్‌

ఊహించినట్లే శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ 20 శాతం నష్టంతో లిస్ట్‌ అయింది. ఈ కంపెనీ ఇష్యూ ధర రూ. 118 కాగా, ఇవాళ ఎన్ఎస్‌ఈలో రూ. 90 వద్ద ప్రారంభమైంది. బీఎస్‌ఈలో రూ. 94 వద్ద లిస్టయింది. అక్కడి నుంచి కోలుకుని రూ. 106.40కి చేరింది. ఈ స్థాయిలో కాస్త ఒత్తిడి రావడంతో ప్రస్తుతం రూ. 101.55 వద్ద 14 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ ధర వద్ద నిఫ్టిలో కొనుగోలుదారులు బాగానే ఉన్నారు.