For Money

Business News

ప్రమోటర్ల వాటా అమ్మకం?

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన స్పైస్‌జెట్‌ను కాపాడుకోవడానికి ఆ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజేయ్‌ సింగ్‌ తన వాటాలో నుంచి పది లేదా 15 శాతం వాటాను విక్రయించనున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. సాంకేతిక అంశాలతో పాటు ఈ కంపెనీ పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విమానాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో తనకున్న వాటాలో కొంత భాగాన్ని అమ్మకాలను ప్రమోటర్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (QIP) ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇప్పటికే దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లతో అజేయ్‌ సింగ్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 2000 కోట్లను ఈ నెలాఖరులోగా సమీకరించాలని ఆయన భావిస్తున్నట్లు పీటీఐ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.