For Money

Business News

ఆయనతో లంచ్‌కు రూ.148 కోట్లు చెల్లించాడు

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్, దానకర్ణుడు వారెన్ బఫెట్‌తో లంచ్‌ చేసే అవకాశాన్ని 19 మిలియన్‌ డాలర్లు అంటే రూ. 148.20 కోట్లు చెల్లించాడు ఓ వ్యక్తి. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఈ వ్యక్తి అదృష్టవంతుడు. ఎందుకంటే 91 ఏళ్ళ బఫెట్‌ … వేలం ద్వారా ఇస్తున్న లంచ్‌ ఇదే చివరిది. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని గ్లైడ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రతిసారీ ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇస్తారు. ఈ వేలాన్ని ఈబే నిర్వహించింది. 2019లో బఫెట్‌తో లంచ్‌కు క్రిప్టో కరెన్సీ వ్యాపారవేత్త జస్టిన్‌ సన్‌ 45 లక్షల డాలర్లు అంటే రూ. 35 కోట్లకు దక్కించుకున్నాడు. కరోనా కారణంగా 2020, 2021లో లంచ్‌ వేలం వేయలేదు. న్యూయార్క్‌ సిటీలోని స్మిత్‌ అండ్‌ వొలెన్‌స్కయ్‌ స్టీక్‌ హౌస్‌లో బఫెట్‌ లంచ్‌ ఇస్తారు. వేలంలో గెలిచిన వ్యక్తితో పాటు ఏడుగురు అతిథులు కూడా ఈ లంచ్‌లో పాల్గొంటారు. 2000లో తొలిసారి బఫెట్‌ లంచ్‌ వేశారు. తరవాత 2003 నుంచి వరుసగా వేస్తున్నారు. ఇప్పటి వరకు 21సార్లు లంచ్‌ను వేలం వేసి… రూ.413 కోట్లు సమీకరించారు. ఇందులో రూ.148 కోట్లు ఈ ఏడాది లంచ్‌ ద్వారా సమకూరాయన్నమాట. ఈ మొత్తం స్వచ్ఛంద సంస్థకే చెల్లించారు.