నిండా మునిగిన చిన్న ఇన్వెస్టర్లు
రోజుకో కొత్త ప్రయోగంతో చిన్న ఇన్వెస్టర్లను ముంచుతున్నారు. కరోనా తరవాత మార్కెట్‌లో ప్రవేశించిన చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వ్యూహంలోచిక్కుకున్నారు. ప్రధానంగా ఐటీ షేర్లలో ఇరుక్కున్నారు. గత కొన్ని రోజులుగా ఐటీ షేర్లు పెరుగుతున్నా… నష్టాల భారం అధికంగానే ఉంది. ఐటీ మినహాయిస్తే దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నారు. కాస్త లాభాలు పర్వాలేదు అని అనుకుంటున్న సమయంలో ప్రైవేట్ బ్యాంకు షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. మొన్న పెరిగిన పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇవాళ ఢమాల్ అన్నారు. ఎపుడూ మార్కెట్‌కు అండగా ఉండే ఫార్మా షేర్లు కూడా కొన్ని రోజుల నుంచి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల సంగతి సరే సరి. దాదాపు 20 శాతం దాకా పడిన షేర్లు చాలా ఉన్నాయి. ఇక మెటల్ షేర్లదీ అదే పరిస్థితి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతుంటే గుడ్డిగా దేశీయ ఆర్థిక సంస్థలు కొన్నాయి. ముఖ్యంగా దేశీయ మ్యూచువల్ ఫండ్లు భారీ ధరలకు కొనుగోలు చేయడంతో…. ఫండ్‌ల నుంచి కూడా రిటర్న్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. SIP చేసని చాలా మంది ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. వీరి ఇన్వెస్ట్‌మెంట్ల వద్ద ఫండ్ మేనేజర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్లు దక్కాయే కాని… ఇన్వెస్టర్లకు దక్కిందేమీ లేదు. దీర్ఘ కాలిక ముసుగులో నెలా నెలా ఇన్వెస్టర్లు మోసపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఏఐ సంబంధిత న్యూఏజ్ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. చూస్తుంటే దేశంలో పెట్టుబడికి ఏ రంగమూ సురక్షితంగా కన్పించడం లేదు. బంగారం ఈటీఎఫ్‌లు కూడా ఆపేయడంతో… ఇపుడు ఇన్వెస్టర్ల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇవాళ కూడా ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి…. మిడ్ సెషన్‌లోపే నష్టాల్లోకి జారుకుంది. మొత్తం లాభాలన్నీ ఆవిరి అయిపోయాయి. ఉదయం అనేక షేర్లను అధిక ధర వద్ద విదేశీ ఇన్వెస్టర్లు వొదిలించుకున్నారు.
